కుమార్తె లవ్ మ్యారేజీకి ఓకే చెప్పిన హీరో వెంకటేష్!

  • హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ మనవడితో ప్రేమాయణం
  • ఇంట్లో చెప్పగా, కుటుంబీకులతో చర్చించి అంగీకరించిన వెంకటేష్
  • వరుడి ఇంటికెళ్లి మాట్లాడి వచ్చిన సురేష్ బాబు
తన కుమార్తె ప్రేమ వివాహానికి ఓకే చెప్పిన హీరో దగ్గుబాటి వెంకటేష్, త్వరలోనే వివాహాన్ని వైభవంగా జరిపించే ఏర్పాట్లు చేస్తున్నారట. టాలీవుడ్ జనాలందిస్తున్న సమాచారం ప్రకారం, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ, ఈ విషయాన్ని తండ్రికి చెప్పిందట. వెంకీ తన కుటుంబీకులతో చర్చించి, ఆశ్రిత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వెంటనే వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సురేందర్ రెడ్డి ఇంటికెళ్లి, వారితో మాట్లాడి వచ్చారని, త్వరలోనే ఎంగేజ్ మెంట్ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆశ్రితకు కాబోయే మామగారు రఘురామిరెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మిత్రుడని సమాచారం. ఆశ్రిత పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Go Back to Shorts
Hyderabad
Race Club
Venkatesh
Tollywood
Asritha

More Telugu News